ఈ వస్తువులను అనుమతించరుఐపీఎల్ మ్యాచ్ కోసం మొత్తం 2500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. ఉప్పల్ స్టేడియం(Uppal Stadium)లో 39 వేల సీటింగ్ కెపాసిటీ ఉందని పేర్కొన్నారు. బుధవారం రాత్రి జరిగే ఈ మ్యాచ్ కోసం స్టేడియం వద్ద 360 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. స్టేడియం లోపల, వెలుపల భారీగా పోలీసుల బందోబస్తు ఉంటుందన్నారు. స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, ల్యాప్ ట్యాప్, బ్యానర్స్, లైటర్స్, బైనాక్యులర్స్, సిగరెట్లు నిషేధమని సీపీ చెప్పారు. కేవలం బ్లూటూత్స్ మాత్రమే అనుమతిస్తామన్నారు. ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో షీ టీమ్స్ (She Teams)మఫ్టీలో ఉంటాయని, ఆకతాయిల పనిపెట్టేందుకు సిద్ధంగా ఉంటారని సీపీ తరుణ్ జోషి(CP Tarun Joshi) తెలిపారు. ఆక్టోపస్ టీమ్స్ కూడా బందోబస్తులో ఉన్నాయని స్పష్టం చేశారు. బుధవారం 3 గంటల ముందు నుంచి మాత్రమే స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతిస్తామన్నారు.
Source link
previous post