పెద్దపల్లిలో 36 గంటల రైతు దీక్షపెద్దపల్లిలో బీఆర్ఎస్ 36 గంటల రైతు నిరసన దీక్ష(BRS Protest) చేపట్టింది. దీక్షకు మాజీమంత్రి, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్(Koppula Eswar) నాయకత్వం వహించారు. 36 గంటల దీక్షలో పెద్దపల్లి, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జడ్పీ చైర్ పర్సన్ లు పుట్ట మధుకర్, దావ వసంత, జక్కు శ్రీహర్షిణి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డి, విద్యాసాగర్ రావు, దివాకర్ రావు పాల్గొన్నారు. సాగునీరు వెంటనే విడుదల చేసి ఎండుతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రైతుల రెండు లక్షల వరకు పంట రుణం తక్షణమే మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. యాసంగిలో చేతికొచ్చిన పంటలు పాలకుల నిర్లక్ష్యంతో ఎండిపోతున్నాయని(Crop Damage), సాగు నీరందించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(Sriram Sagar Project) నుంచి వెంటనే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలన్నారు. పంటలు ఎండిపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని, వ్యవసాయానికి కోతలు లేకుండా కరెంటు ఇవ్వాలని, రూ.2 లక్షల రుణ మాఫీని వెంటనే అమలు చేయాలన్నారు. ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతు బంధు చెల్లించాలని డిమాండ్ చేశారు. యాసంగి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ చెల్లించాలన్నారు.
Source link