Entertainment

ఉస్తాద్ ఆయుధ పూజ.. నెవర్ బిఫోర్ లుక్ లో పవర్ స్టార్!


గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా మరో కొత్త పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్.

దసరా కానుకగా ఆయుధ పూజ శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి మేకర్స్ తాజాగా కొత్త పోస్టర్ ను వదిలారు. ఖాకీ దుస్తుల్లో నెత్తుటి మరకలతో ఉన్న పెద్ద సుత్తిని పట్టుకొని ఉన్న పవన్ కళ్యాణ్ పోస్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. పోస్టర్ ని బట్టి ఇదొక భారీ యాక్షన్ సన్నివేశంలోని స్టిల్ అని అర్థమవుతోంది. చూస్తుంటే ఈ సినిమాలో పవన్ తన వయలెన్స్ తో విజిల్స్ కొట్టించేలా ఉన్నాడు.



Source link

Related posts

గూస్ బంప్స్ తెప్పిస్తున్న 'థీమ్ ఆఫ్ కల్కి'…

Oknews

మెగాస్టార్ సినిమాకి ఎందుకు నో చెప్పానంటే…

Oknews

సాంబార్ పిల్ల ‘కుట్టి’ ఎంత బాగుందో

Oknews

Leave a Comment