Top Stories

ఊహూ.. బాబుకు ద‌క్క‌ని ఊర‌ట‌!


తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడికి చెడ్డ రోజులు న‌డుస్తున్నాయి. న్యాయ‌స్థానాల్లో ఆయ‌న‌కు ఏదీ క‌లిసి రావడం లేదు. ఒక‌ప్పుడు చంద్ర‌బాబుకు న్యాయ‌స్థానాల్లో కోరుకున్నట్టు జ‌రిగేద‌నే పేరు వుంది. ఇప్పుడు ప‌రిస్థితులు పూర్తి విరుద్ధంగా మారాయి. ఇదేనేమో కాల మ‌హిమ అంటే.

తాజాగా అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు (ఏఆర్ఆర్‌) కేసులో ముంద‌స్తు బెయిల్ కోసం పోరాడుతున్న చంద్ర‌బాబుకు ఆశించిన ఫ‌లితం ద‌క్క‌లేదు. స్కిల్ స్కామ్‌లో చంద్ర‌బాబునాయుడు ఇప్ప‌టికే అరెస్ట్ అయి నెల‌కు పైగా రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో ఉన్నారు. ఆ కేసులో ఆయ‌న ఎప్పుడు బ‌య‌టికొస్తారో ఎవ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి. ఆ కేసులో బాబు క్వాష్ పిటిష‌న్‌పై సుదీర్ఘ వాద‌న‌లు ముగిశాయి. తీర్పు కోసం రెండు రోజుల పాటు ఎదురు చూడాల్సిన ప‌రిస్థితి. క్వాష్ పిటిష‌న్‌పై బాబు భ‌విష్య‌త్ ఆధార‌ప‌డి వుంది.

ఈ కేసులో ఎలా బ‌య‌ట ప‌డాలో దిక్కుతోచ‌ని స్థితిలో ఇన్న‌ర్ రింగ్ రోడ్డు వ్య‌వ‌హారాన్ని సీఐడీ ముందుకు తెచ్చింది. దీంతో ముంద‌స్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టుకు బాబు లాయ‌ర్లు ప‌రుగులు తీశారు. ముంద‌స్తు బెయిల్‌పై విచార‌ణ‌ను మ‌రోసారి హైకోర్టు వాయిదా వేసింది. న‌వంబ‌ర్ 7న తిరిగి విచార‌ణ జ‌రుపుతామ‌ని హైకోర్టు తెలిపింది.

దీంతో బాబు, ఆయ‌న అభిమానులు నిరుత్సాహానికి గుర‌య్యారు. ఒక‌దాని వెంట మ‌రొక కేసు బాబును వెంటాడుతున్నాయి. మ‌రోవైపు న్యాయ‌స్థానాల్లో కేసుల విచార‌ణ వేగంగా జ‌ర‌గ‌డం లేద‌నే ఆవేద‌న వారిలో వుంది. వాయిదాలపై వాయిదాలు ప‌డుతుండ‌డంతో బాబు ఇంకెంత కాలం జైల్లో వుండాల్సి వ‌స్తుందోన‌నే ఆందోళ‌న వారిలో నెల‌కుంది.



Source link

Related posts

బయటకు వస్తే మళ్లీ అరెస్టు తప్పదు!

Oknews

దేవర.. పుష్ప 2.. డేట్ లు ఎప్పుడు?

Oknews

పాన్ ఇండియా స్టార్ స్ఫూర్తితో 'జై హనుమాన్'

Oknews

Leave a Comment