ఎండ వేడి కారణంగా కాళ్లలో ఎదురయ్యే తిమ్మిర్లను తగ్గించడానికి టిప్స్!


posted on Apr 13, 2024 11:58AM

ఉష్ణోగ్రత తగ్గుదల కారణంగా చాలా మంది  శీతాకాలం లేదా రుతుపవన కాలంలో కాళ్ల తిమ్మిరి సమస్య గురించి కంప్లైంట్ చేస్తుంటారు. కానీ చలికాలంతో పోలిస్తే వేసవిలో కాళ్ల నొప్పులు తీవ్రమవుతాయని తెలిస్తే ఖచ్చితంగా  షాక్ అవుతారు. మరీ ముఖ్యంగా  ఈ కాలానుగుణ తిమ్మిర్లు ఎక్కువగా అథ్లెట్లు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు,  వృద్ధులపై ప్రభావం చూపుతాయి.వైద్యుల అభిప్రాయం ప్రకారం  వేడిని బహిర్గతం చేయడం వల్ల  కండరాల తిమ్మిరి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  వీటిని నిర్లక్ష్యం చేయడం అస్సలు మంచిది కాదు.. అసలు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా తిమ్మిర్లు ఎందుకు వస్తాయి.   వీటిని ఎలా తగ్గించుకోవచ్చంటే..

వేసవి కాలంలో చాలావరకు పిల్లలకు సెలవులు ఉంటాయి. ఈ కారణంగా పెద్దలు కూడా అడపాదడపా సాధారణ రోజుల్లో కంటే వేసవిలో ఎక్కువ యాక్టీవ్ గా ఉంటారు. పిల్లలు పెద్దలు కలిసి ఫిజికల్ యాక్టీవ్ విషయంలో చురుగ్గా ఉంటారు. వ్యాయామాలు, జిమ్ తో పాటూ ఇతర యాక్టివిటీస్ కారణంగా కండరాల తిమ్మిరి వస్తుంది. విపరీతంగా చెమటలు పట్టడం, శరీరం నుండి ద్రవాలు బయటకు వేగంగా పోవడం వల్ల శరీరం తొందరగా డీహైడ్రేట్ అవుతుంది.  కాళ్ల తిమ్మిర్లు తగ్గించుకోవడానికి మార్గాలు..

వేడి గాయాల గురించి అవగాహన పెంచుకోవాలి.  దీని వల్ల వేడి గాయాలు అయినప్పుడు వెంటనే చికిత్స చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే కాళ్ల తిమ్మిర్లు వచ్చే అవకాశాలు తక్కువ.

కాల్షియం, మెగ్నీషియం,  పొటాషియం వంటి  రోజువారీ సప్లిమెంట్లను తీసుకోవడం..  రోజుకు కనీసం 10-12 గ్లాసుల నీరు త్రాగడం వంటి ఇతర ముందు జాగ్రత్త చర్యలు పాటించాలి. తగినంత ద్రవాలు లేనప్పుడు లేదా పొటాషియం లేదా కాల్షియం వంటి తక్కువ స్థాయి ఖనిజాలు లేనప్పుడు ఎక్కువ పని చేయడం వల్ల కూడా  కండరాల తిమ్మిర్లు వస్తాయి.

వ్యాయామం చేయడానికి ప్రయత్నించాలి.  విశ్రాంతి తీసుకోవాలి.   కండరాలను సున్నితంగా  సాగదీయదీయడం,  సున్నితంగా మసాజ్  చేయడం  చేయవచ్చు. తిమ్మిరి తర్వాత తీవ్రమైన కాలు నొప్పి ఉంటే వ్యాయామం చేయకూడదు.


కాళ్లలో తిమ్మిరి ఉండే ఆ ప్రాంతంలో  హీటింగ్ ప్యాడ్‌ని ఎంచుకోవాలి.   నిద్రపోతున్నప్పుడు అర్ధరాత్రి కాలు తిమ్మిరిని సమస్య వస్తే  నిలబడి కండరాలను సాగదీయడం,  మడమను నేలపై ఉంచి కాస్త నడవడం.   కాలుపై బరువు పెట్టడం వంటి చర్యల ద్వారా  తిమ్మిరిని వదిలించుకోవచ్చు.

                         *నిశ్శబ్ద.

 



Source link

Leave a Comment