ఆ హీరోలిద్దరు ఇండియాలోనే టాప్ స్టార్స్. వారిరువురి నుంచి మూవీ రిలీజ్ అయ్యిందంటే చాలు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ల వర్షంలో తడిసి ముద్దవ్వాల్సిందే. పైగా రెండు దశాబ్దాలపై నుంచి ప్యూర్లీ పాన్ ఇండియా స్టార్స్ కూడాను. ఆ ఇద్దరే మోహన్ లాల్, షారుక్ ఖాన్. తాజాగా ఆ ఇద్దరి మధ్య జరిగిన ఒక చర్చ అభిమానుల్లో ఆనందాన్ని తీసుకొచ్చింది.
గత ఏడాది వచ్చిన షారుక్ హిట్ మూవీ జవాన్. అందులో ఒక హిట్ సాంగ్ ఉంటుంది. జిందా బందా అనే ఆ సాంగ్ కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. నేటికీ చాలా ఫంక్షన్స్ లో మారుమోగిపోతుంటుంది. తాజాగా మలయాళ చిత్ర సీమలో ఒక సినిమా ఫంక్షన్ జరిగింది. అందులో మోహన్ లాల్ జిందా బంధా సాంగ్ కి డ్యాన్స్ చేసాడు. షారుక్ స్టెప్ లని యాజ్ టీస్ దించేసాడు. టోటల్ గా ఆ ఈవెంట్ కే ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలిచింది. ఇప్పుడు ఆ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో షారుఖ్ ట్విట్టర్ వేదికగా రంగంలోకి దిగాడు. మోహన్ లాల్ సార్ మీరు డ్యాన్స్ అదరగొట్టారు అంటూ ట్వీట్ చేసాడు.
ఆ తర్వాత మోహన్ లాల్ కూడా ట్విట్టర్ వేదికగా రంగంలోకి దిగాడు. ఆ సాంగ్ కి మీకంటే ఎవరూ బాగా డ్యాన్స్ చేయలేరు. మీరు మాత్రమే బెస్ట్ అంటూ ట్వీట్ చేసాడు. జిందా బందా బ్రేక్ ఫాస్ట్ చేద్దామా అంటూ కూడా పోస్ట్ చేసాడు. అలాగే సార్, ప్లేస్ మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా అంటూ షారుఖ్ కూడా వెంటనే రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఆ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా మోహన్ లాల్ జిందా బందా పాటకి డాన్స్ చేసాడు. ఇక ఈ ఇద్దరి కాంబోలో ఇంతవరకు సినిమాలు రాలేదు. రావాలని ఇద్దరి అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే తమ తమ కొత్త ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.