అప్పట్లో చంద్రబాబుకు కేటాయించిన నివాసం పక్కనే, నంబర్ 2 జన్‌పథ్ క్వార్టర్‌లో మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నివాసం ఉండేవారు. 2014-19 మధ్య కాలంలో 1 జన్‌పథ్‌లో సదుపాయాల కల్పన, భద్రతా ఏర్పాట్ల కోసం దాదాపు రూ.5కోట్లను ఏపీ ప్రభుత్వం వెచ్చింది. అప్పట్లో పలు కారణాలతో చంద్రబాబు ఈ నివాసంలో ఉండేందుకు ఆసక్తి చూపేవారు కాదు. రాజకీయమైన విమర‌్శలకు తావివ్వకూడదనే ఉద్దేశంతోనే ఆయన అధికారిక నివాసంలో బస చేయడానికి సుముఖత చూపేవారు కాదని చెబుతారు.