ప్రతిష్ఠాత్మక నంది అవార్డులను గద్దర్ అవార్డులతో భర్తీ చెయ్యాని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఈ కొత్త కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేయడానికి అవసరమైన సలహాలను, సూచనలను, అవార్డులపై తమ అభిప్రాయాలను తెలియజేయాలని ముఖ్యమంత్రి చిత్ర పరిశ్రమను కోరారు. అయితే చిత్ర పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ విషయమై తన బాధ్యను వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు తెలుగు చిత్ర పరిశ్రమ స్పందన లేకపోవడం పట్ల ముఖ్యమంత్రి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే ఇటీవల తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సంయుక్తంగా ఒక ప్రకటనను విడుదల చేశాయి. ఆ ప్రకటనలో ‘తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిగారు, గౌరవ సినిమాటోగ్రీఫీ మంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డిగారు చేస్తున్న కృషికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు కొద్ది రోజుల క్రితం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన సంస్థల ప్రతినిదులకు వారి సమయం ఇచ్చి ఆ మీటింగులో పరిశ్రమ గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. మన తెలుగు సినిమా ప్రపంచస్థాయిలో మంచి పేరు తెచ్చుకుంటున్నందుకు సంతోషం వ్యక్తపరుస్తూ కొత్త గవర్నమెంటు తెలుగు చలన చిత్ర పరిశ్రమ తెలంగాణాలో అన్నిరకాల అభివృద్ధికి కృష్హి జేస్తారని తెలియజేసారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి ఇకపై సినిమా పరిశ్రమకు చెందిన వారికి ‘గద్దర్ అవార్డులు’ ప్రదానం చేస్తామని దానికి సంబంధించిన విధివిధానాలు తయారు చేయాలని కోరారు.
ఈ విషయంలో, తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, మరియు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ‘గద్దర్’ అవార్డ్స్ గైడ్‌లైన్స్‌ను తెలంగాణ ఎఫ్‌డిసి వారికి తెలియజేయడం జరిగింది. ఆవిధంగా త్వరలో ‘గద్దర్ అవార్డు’ కొరకు మార్గదర్శకాలు తెలంగాణ ఎఫ్‌డిసి వారి సంప్రదింపులతో తయారు జేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి గారికి త్వరలో ఇవ్వడం జరుగుతుంది. గద్దర్‌గారిని చూసి మేము గర్విస్తున్నాము. ఆయన నటునిగా, కళాకారులుగా, జానపద పాటలందు మరియు పేదలకు చేసిన సేవలకు సేవా రంగంలో ఆయన చేసిన విలువైన కృషికి లెజెండ్‌గా ఆయన పట్ల మాకు చాలా గౌరవం ఉంది అని తెలియజేస్తున్నాము’ అని ఆ ప్రకటనలో తెలియజేశారు.