Health Care

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. కరెంట్ స్తంభాలతో జర జాగ్రత్త!


దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ వర్షాల్లో తడవడం వలన అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అందువలన చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా నగరాల్లో చాలా మంది ఉద్యోగాల కోసం వెళ్తుంటారు. ఈ క్రమంలో కొందరు ఉదయం షిఫ్ట్ చేస్తే మరికొందరు నైట్ షిఫ్ట్‌లు చేస్తూ ఉంటారు. అయితే వారు వర్షంలో ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురు అవుతోంది. ఇలాంటి సందర్భంలో కొన్ని చోట్ల కరెంట్ ఉండకపోవడం, మ్యాన్ హోల్ ఉందో తెలియకపోవడం, చెట్లు విరిగి పడటం, కరెంట్ స్తంభాలు కరెంట్ షాక్ ఇవ్వడం వంటి ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంటుంది. అందువలన వర్షాకాలంలో కరెంట్ స్తంభాల వద్ద చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.కాగా, వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కరెంట్ స్తంభాల వద్దల ఎంత జాగ్రత్తగా మెదులుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1. వర్షాకాలం కరెంట్ స్తంభాలకు దగ్గరగా అస్సలే నడవకూడదంట.

2. చేతులను ఎప్పుడూ పొడిగా ఉంచుకోవడమే కాకుండా, విద్యుత్ లైన్ల వద్ద అస్సలే బట్టలు ఆరబెట్టకూడదంట.

3. వర్షం పడి గాలి దుమారం, ఉరుములు మెరుపులు వస్తున్న సమయంలో ట్రాన్స్ ఫార్మర్ల వద్ద లేదా సెల్ టవర్ల వద్ద లేదా చెట్ల కింద అస్సలే నిలబడకూడదంట, స్మార్ట్ ఫోన్ కూడా యూస్ చేయకూడదంట.

4.మీరు వెళ్తున్న క్రమంలో విద్యుత్ తీగలు కిందికి వంగడం లేదా రోడ్డుపై పడినట్లు కనిపిస్తే వాటికి దూరంగా వెళ్లాలంట.

5. తడిచిన గోడలను లేదా, విద్యుత్ స్తంభాలను అస్సలే తాకకూడదంట.



Source link

Related posts

ఎసిడిటీ తో బాధ పడేవారు వీటిని తప్పనిసరిగా తీసుకోండి

Oknews

Ask Your PDF : PDF ఫైల్ డేటాను క్షణాల్లో వివరిస్తున్న AI సాధనం.. ఎలాగో తెలుసా

Oknews

Summer Health tips : వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ పండ్లను తీసుకోండి

Oknews

Leave a Comment