ఎనర్జీ డ్రింక్స్ తాగితే గుండెపోటు వస్తుందా? అసలు నిజాలు ఇవీ..! | Can Consuming Energy Drinks Cause a Heart Attack| Energy Drinks| Energy Drinks Friend or foe to your heart| Heart Attack


posted on Apr 3, 2025 10:49AM


ఎనర్జీ డ్రింక్స్ చాలా రుచిగా ఉంటాయి. అంతేకాదు ఇవి తాగగానే బాగా యాక్టీవ్ గా అనిపిస్తుంది కూడా. ఈ రోజుల్లో యువత టీవీ యాడ్స్,   ఫిట్‌నెస్ ఐకాన్‌ లు   శక్తి కోసం ఎనర్జీ డ్రింక్స్ తాగడం చూసి ఎనర్జీ డ్రింక్స్ వైపు ఆకర్షితులవుతున్నారు. యువత మాత్రమే కాదు, అన్ని వయసుల వారు తమను తాము శక్తివంతంగా ఉంచుకోవడానికి,  తక్షణ శక్తి కోసం   ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారు. ఈ పానీయాలు తాగడం వల్ల  శరీరానికి కొత్త శక్తి వస్తుంది, కానీ నిజం ఏమిటంటే అవి  గుండె ఆరోగ్యానికి కూడా చాలా హాని కలిగిస్తున్నాయి.


వ్యాయామం చేసిన తర్వాత ఎనర్జీ డ్రింక్స్ తాగడం చాలా మంది అలవాటు. దీని వల్ల శరీరానికి ఎనర్జీ వస్తుందని అనుకుంటారు.  అయితే దీని వల్ల  వ్యాయామం చేసినా ఎటువంటి ప్రయోజనం ఉండదని, దీనికి విరుద్ధంగా అది గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.


ఎనర్జీ డ్రింక్స్ లో  ఏముంది?

ఎనర్జీ డ్రింక్స్ లో ప్రధానంగా కెఫిన్, చక్కెర, టౌరిన్, గ్వారానాతో పాటు  కొన్ని ఇతర ఉత్తేజకాలు ఉంటాయి. ఈ మూలకాలన్నీ శరీరానికి తక్షణ శక్తిని అందించడానికి పనిచేస్తాయి, కానీ వాటి అధిక పరిమాణం  హానికరం కావచ్చు.

ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల గుండెపోటు వస్తుందా?

 అధిక కెఫిన్

ఎనర్జీ డ్రింక్స్ లో అధిక మొత్తంలో కెఫిన్ ఉంటుంది, ఇది హృదయ స్పందన రేటు,  రక్తపోటును పెంచుతుంది. ఇది హృదయనాళ వ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుంది,  గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

రక్తపోటులో ఆకస్మిక పెరుగుదల

ఎనర్జీ డ్రింక్స్ తాగిన తర్వాత రక్తపోటు పెరుగుతుందని పరిశోధనలలో తేలింది.  ఇప్పటికే అధిక రక్తపోటు ఉంటే, ఎనర్జీ డ్రింక్స్ తాగడం ప్రమాదకరం. దీని కారణంగ గుండెపోటు ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.


అధిక చక్కెర స్థాయి

చాలా ఎనర్జీ డ్రింక్స్ లో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది,. ఇది మధుమేహం,  ఊబకాయాన్ని పెంచుతుంది. ఈ రెండూ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచడానికి ప్రధాన కారణాలు.  గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి.

 క్రమరహిత హృదయ స్పందన

ఎనర్జీ డ్రింక్స్ లో ఉండే కెఫిన్,  ఇతర ఉత్తేజకాలు క్రమరహిత హృదయ స్పందన (అరిథ్మియా) కు కారణమవుతాయి. ఇది తీవ్రమైన పరిస్థితికి దారితీస్తుంది. దీని వల్ల గుండెపోటు వస్తుందనే భయం ఉంటుంది.

శాస్త్రీయ అధ్యయనాలు ఏమి చెబుతున్నాయి?

ఎనర్జీ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని అనేక అధ్యయనాలు కనుగొన్నాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనం ప్రకారం ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల రక్తపోటు,  హృదయ స్పందన రేటుపై ప్రతికూల ప్రభావం ఉంటుంది, ముఖ్యంగా ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడుతున్న వారిలో చాలా ప్రభావం ఉంటుంది.

                         *రూపశ్రీ

 

 

గమనిక:

ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు…



Source link

Leave a Comment