జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’ (Devara). యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ పాన్ ఇండియా మూవీ సెప్టెంబర్ 27 థియేటర్లలో అడుగు పెట్టనుంది. భారీ అంచనాలతో విడుదలవుతున్న ఈ సినిమాకి పోటీగా రావడానికి ఇతర సినిమాలు వెనకడుగు వేస్తుంటాయి. కానీ అల్లరి నరేష్ మాత్రం తగ్గేదేలే అంటున్నాడు.
అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా సుబ్బు మంగదేవి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బచ్చల మల్లి’ (Bachhala Malli). హాస్య మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నరేష్ ఊరమాస్ రోల్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో రిలీజ్ చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తమ కంటెంట్ మీద నమ్మకంతో ఏకంగా ‘దేవర’ను ఢీ కొట్టడానికి సిద్ధమవుతున్నారా? లేక వేరే డేట్ దొరకక ‘దేవర’ విడుదలకు రెండు మూడు వారాల ముందు విడుదల చేసే ఆలోచనతో సెప్టెంబర్ లో విడుదల అని ప్రకటించారా? అనేది ఆసక్తికరంగా మారింది.