EntertainmentLatest News

ఎన్టీఆర్ కే నా ఓటు అంటున్న ప్రశాంత్ నీల్!


డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) నెక్స్ట్ మూవీ ఏంటనే సస్పెన్స్ కొంతకాలంగా నెలకొని ఉంది. ప్రభాస్ (Prabhas) తో ‘సలార్-2’ (Salaar 2) మొదలు పెడతాడా? లేక జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)తో ‘డ్రాగన్’ (Dragon) మూవీని ముందు స్టార్ట్ చేస్తాడా? అంటూ అందరూ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో హిందీ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. ఆగస్టు రెండో వారంలో ‘సలార్-2’ స్టార్ట్ అవుతుందని, ‘డ్రాగన్’ కూడా త్వరలోనే మొదలవుతుందని.. ఈ రెండు సినిమాల షూటింగ్ పారలల్ గా జరుగుతుంది అనేది ఆ వార్త సారాంశం. అయితే నీల్ సన్నిహిత వర్గాలు మాత్రం ఈ న్యూస్ కొట్టిపారేస్తున్నాయి. ప్రజెంట్ ప్రశాంత్ నీల్ దృష్టి అంతా ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పైనే ఉందని అంటున్నారు.

‘సలార్’ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్.. ఈ మూవీ సెకండ్ పార్ట్ ని వీలైనంత త్వరగా రూపొందించాలని భావిస్తోందట. కానీ నీల్ మాత్రం తన మొదటి ఓటు ‘డ్రాగన్’ కే అంటున్నాడట. నిజానికి ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మూవీ ప్రకటన ఎప్పుడో మూడేళ్ళ క్రితమే వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించనుంది. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఒక సందర్భంలో నీల్ చెప్పాడు. అందుకు తగ్గట్టుగానే ఈ ప్రాజెక్ట్ పై నీల్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట. ప్రస్తుతం తన ఫుల్ ఫోకస్ దీనిపైనే ఉందట. త్వరలోనే ‘డ్రాగన్’ సెట్స్ పైకి వెళ్లనుందని, దీంతో పాటు పారలల్ గా ‘సలార్-2’ చేసే ఆలోచన నీల్ కి అసలు లేదని సమాచారం. ‘డ్రాగన్’ పూర్తయ్యాకే ‘సలార్-2’ని మొదలుపెట్టే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

మరోవైపు ప్రభాస్ సైతం ఇతర ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘రాజాసాబ్’, ‘కల్కి-2’, ‘హను రాఘవపూడి ప్రాజెక్ట్’, ‘స్పిరిట్’ లైన్ లో ఉన్నాయి. ఈ లెక్కన ప్రభాస్ సైతం ఇప్పట్లో ‘సలార్-2’కి టైం కేటాయించడం కష్టమే.



Source link

Related posts

petrol diesel price today 06 February 2024 fuel price in hyderabad telangana andhra pradesh vijayawada | Petrol Diesel Price Today 06 Feb: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Oknews

Padma Awards 2024 Padma Vibhushan Bhushan Padma Shri List Awardees From Telugu States | Padma Awards 2024: పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం

Oknews

‘కన్నప్ప’ చిత్రంలో మరో ఎంట్రీ.. రంగంలోకి దిగుతున్న బాలీవుడ్‌ స్టార్‌ హీరో!

Oknews

Leave a Comment