EntertainmentLatest News

ఎన్టీఆర్ టిల్లు స్క్వేర్ గురించి ఏం చెప్తాడు


ఎవరండీ ఎండలు పెరిగాయని  చెప్పింది. సరే మీరు అనుకున్నట్టుగానే ఎండలు పెరిగాయని అనుకుందాం. ఇప్పుడు ఈ ఎండలని ఎన్టీఆర్ తగ్గించబోతున్నాడు. నేను చెప్పబోయే న్యూస్ ఉంటే మీరు కూడా అదే అంటారు. 100 % ఇది నిజం. మరి ఆ వార్త ఏంటో చూద్దామా.

మొన్న మార్చి 29 న టిల్లు స్క్వేర్ వరల్డ్ వైడ్ గా విడుదల అయ్యింది. అన్ని చోట్ల కూడా సూపర్ హిట్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది. ఎన్టీఆర్  టాపిక్ మధ్యలో  టిల్లుస్క్వేర్  టాపిక్ ఏంటని  అనుకుంటున్నారా!  8 వ తేదీన టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ జరగనుంది.  ఈ ఫంక్షన్ కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు. ఈ సమ్మర్ కి ఇదే కూలెస్ట్ న్యూస్. ఇప్పుడు అర్థమైందా ఎన్టీఆర్ ఎండల్ని తగ్గించబోతున్నాడని ఎందుకు అన్నానో.     మాస్ అనే పదానికి పెట్టింది పేరైన ఎన్టీఆర్ టిల్లు గురించి ఏం మాట్లాడతాడో అనే క్యూరియాసిటీ అందరిలో ఉంది.   

 ఇక టిల్లు స్క్వేర్ 100 కోట్ల క్లబ్ చేరువలో ఉంది. ఈ సమయంలో ఎన్టీఆర్ లాంటి స్టార్ టిల్లు గురించి మాట్లాడటంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.  ఇక సిద్దు జొన్నల గడ్డ ఇటీవల ఎన్టీఆర్ ని కలిసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.మరి రేపు సక్సెస్ మీట్ ఏ మేర సంచలనం సృష్టిస్తుందో చూడాలి. సితార ఎంటటైన్ మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ ఫోర్ లు టిల్లు స్క్వేర్ ని  సంయుక్తంగా నిర్మించాయి. అనుపమ పరమేశ్వరన్ సిద్దు సరసన జోడి కట్టింది.

 



Source link

Related posts

బైరెడ్డి.. ఆ ఆడబిడ్డల కన్నీళ్లు నీకు కనిపించలేదా..

Oknews

Allu Arjun has arrived in Visakhapatnam అల్లు అర్జున్ క్రేజ్ ఏముందిరా..

Oknews

ప్రముఖ గాయని ఆత్మ హత్య

Oknews

Leave a Comment