Entertainment

ఎన్టీఆర్ టైటిల్ ని రామ్ చరణ్ లాక్కుంటున్నాడా! ఎంతైనా ఫ్రెండ్ కదా 


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరి కొద్దీ రోజుల్లో గేమ్ చేంజర్ షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టబోతున్నాడు. అంటే ఎండింగ్ ఇవ్వబోతున్నాడు. ఒక వేళ మళ్ళీ ఏమైనా జరిగి షూటింగ్ వాయిదా పడితే చెప్పలేం కానీ షూటింగ్ అయితే చివరి దశలో ఉంది. ఆ విషయాన్నిపక్కన పెడితే  చరణ్ అప్ కమింగ్ మూవీకి సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

చెర్రీ తన కొత్త  మూవీని  ఉప్పెన ఫేమ్  బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్నాడు.ఇది అందరకి తెలిసిన విషయమే.   ఈ నెల 20 న ఆ మూవీ ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. అలాగే సినిమాకి సంబంధించిన పూర్తి విషయాలు కూడా ఆ రోజే తెలియనున్నాయని అంటున్నారు. ఇక టైటిల్ మీద కూడా ఆసక్తికరమైన వార్త హల్ చల్ చేస్తుంది. పెద్ది అనే టైటిల్ ని కన్ఫార్మ్ చేశారనే వార్తలు వస్తున్నాయి. స్వయంగా చరణ్ ఫ్యాన్సే సోషల్ మీడియాలో  ఈ విషయాలన్నీ పోస్ట్ చేస్తున్నారు.మరి బుచ్చిబాబు  టీం ఆ వార్తలపై ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇక పెద్ది టైటిల్ ని ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు గతంలోనే  రిజిస్టర్ చేయించాడు. ఎప్పటినుంచో  ఎన్టీఆర్ కి చెప్పిన కథ తోనే బుచ్చి బాబు చరణ్ తో చేస్తున్నాడనే రూమర్ వినబడుతు ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు టైటిల్ ప్రస్తావన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక వేళ చరణ్ మూవీకి పెద్ది అనే టైటిల్ పెడితే మాత్రం ఎన్టీఆర్ తన ఫ్రెండ్ కోసం త్యాగం చేసినట్టే అవుతుంది.ఎన్టీఆర్ చరణ్ లు ప్రాణ మిత్రులన్న విషయం అందరకి తెలిసిందే. ఆల్రెడీ ఇద్దరు కలిసి ఆర్ఆర్ఆర్ లో నటించారు.ఆ మూవీ ఇండియా వ్యాప్తంగా రికార్డు కలెక్షన్స్ ని సృష్టించింది.అదే టైం లో ఆస్కార్ ని కూడా తెచ్చిపెట్టింది.



Source link

Related posts

ఆగస్ట్‌ 15.. సంక్రాంతిని మించి పోయిందే.. ఎలాగంటే?

Oknews

did a big mistake in graveyard

Oknews

కొత్త సినిమాలో రతికరోజ్…

Oknews

Leave a Comment