మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు కలిశారు. తన సోదరుడు శిరీష్ కుమారుడు ఆశిష్ వివాహానికి ఆహ్వానించడం కోసం ఆయన తాజాగా ఎన్టీఆర్ నివాసానికి వెళ్లారు. దిల్ రాజు వెంట శిరీష్, ఆశిష్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫొటోలలో ఎన్టీఆర్ లుక్ ఆకట్టుకుంటోంది.
కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చివరిదశలో ఉంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించగా.. కొన్ని కారణంగా వాయిదా పడినట్లు వార్తలు అనిపిస్తున్నాయి. ‘దేవర’ తర్వాత బాలీవుడ్ ఫిల్మ్ ‘వార్-2’తో పాటు ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్, ‘దేవర-2’ లైన్ లో ఉన్నాయి. వీటితో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేసే అవకాశముందని టాక్.