బొబ్బిలిపులి లోని సంభవం నీకే సంభవం అనే ఎన్టీఆర్(ntr)పాటని ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ పాడుకుంటున్నారు. అఫ్ కోర్స్ నేను చెప్పబోయేది వింటే మీరు కూడా సంభవం ప్రభాస్ కే సంభవం అని పాడతారు.
ప్రభాస్(prabhas)కల్కి(kalki 2898 ad)వరల్డ్ వైడ్ గా ల్యాండ్ అయ్యి ఇరవై ఐదు రోజులు దాకా అవుతుంది. కానీ ఇప్పటికి అన్ని చోట్ల మంచి వసూళ్లనే రాబడుతు ముందుకెళ్తుంది. ఇందుకు నిదర్శనంగా కొన్ని రోజుల క్రితం 1000 కోట్ల కలెక్షన్ ని సాధించి ఇండియాలోనే బిగెస్ట్ హిట్ లలో ఒకటిగా నిలిచింది. తాజాగా మరో అరుదైన రికార్డు కల్కి ఖాతాలో చేరింది. నార్త్ అమెరికాలో ఏకంగా 18 మిలియన్ డాలర్లు మార్కుని క్రాస్ చేసిన మూవీగా సెన్సేషనల్ సృష్టించింది. ఈ విషయాన్ని కల్కిని నార్త్ అమెరికాలో డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రత్యంగిరా సినిమాస్ అండ్ ఏ ఏ క్రియేషన్స్ అధికారంగా వెల్లడి చేసాయి. అదే విధంగా నార్త్ అమెరికాలో ఇంతవరకు ఏ ఇండియన్ సినిమా కూడా చేరుకోని ఫీట్ సాధించినట్టు కూడా తెలిపాయి.
ఇక ఇప్పుడు అందరు కల్కి 2 కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కూడా జరిగిందని ప్రొడ్యూసర్ అశ్వనిదత్ వెల్లడి కూడా చేసాడు. పార్ట్ వన్ లో మెరిసిన వాళ్ళందరు పార్ట్ టూ లో కూడా చెయ్యబోతున్నారు. ప్రభాస్, కమల్ హాసన్(kamal haasan)అమితాబ్, దీపికా పడుకునే ల నటన పార్ట్ టూ లో మరింతగా ప్రేక్షకులని మెస్మరైజ్ చేయనుంది. దర్శకుడు నాగ్ అశ్విన్(nag ashwin)కూడా కల్కి 2 పనుల్లోనే ఉన్నాడు.