GossipsLatest News

ఎన్టీఆర్ వార్ లుక్ తో బాలీవుడ్ హీరోయిన్ సెల్ఫీ


గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ఇప్పుడు ముంబై లో ఉన్నారు. ఆయన హిందీ లో గ్రాండ్ గా లాంచ్ కాబోతున్న వార్ 2 షూటింగ్ కోసం ముంబై వెళ్లారు. ఎన్టీఆర్ ముంబై వెళ్లినప్పటి నుంచి ఆయన కాలు కదిపినా సన్సేషన్ అవుతుంది. అంతలా ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ముంబై కి వెళ్లేందుకు బేగంపెట్ ఎయిర్ పోర్ట్ కి వచ్చింది మొదలు ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి వార్ 2 సెట్స్ కి వెళ్లెవరకూ ఎన్టీఆర్ మీడియా లో తెగ హైలెట్ అయ్యారు. 

ఇక ఎన్టీఆర్ వార్ 2లో ఎలా ఉండబోతున్నారో అనేది చాలామందికి ఓ ఐడియా ఉంది. ఇండియన్ రా ఏజెంట్ ఎలా ఉంటారో చాలామంది ఊహించుకుంటున్నారు. ఎన్టీఆర్ వార్ 2లో రా ఏజెంట్ గా కనిపిస్తారనే టాక్ ఉంది. అయితే తాజాగా ఎన్టీఆర్ వార్ 2 లుక్ లీకైంది. ఎలా అంటే బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేల్ల ఎన్టీఆర్ తో దిగిన సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవడం కాదు వార్ 2 లో ఎన్టీఆర్ ఎలా ఉండబోతున్నాడో అనేది కూడా లీకైంది. ముంబైలోని జిమ్ లో వర్కౌట్స్ చేసేందుకు వచ్చిన ఎన్టీఆర్ తో ఊర్వశి సెల్ఫీ తీసుకుంది.  

ఊర్వశి రౌతేల్ల ఆ పిక్ ను పోస్ట్ చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ మా ప్రియమైన నిజమైన గ్లోబల్ సూపర్‌ స్టార్.. నిజాయితీ, వినయం, క్రమశిక్షణతో మీ వ్యక్తిత్వం నిజంగా ప్రశంసనీయం. ఫ్యూచర్ లో మీతో కలిసి పని చేయడానికి రెడీ అంటూ చాలా ఎగ్జైట్ అవుతూ క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ లుక్ ఇదే అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ సంబరపడిపోతున్నారు. 



Source link

Related posts

Boney Kapoor on Sridevi being pregnant పెళ్ళికి ముందే జాన్వీ పుట్టిందా: బోని రియాక్షన్

Oknews

KCR vs CM Revanth Reddy | KCR vs CM Revanth Reddy |తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌నే బయట తిరగనివ్వరా..?

Oknews

మహేష్-రాజమౌళి కాంబోపై కీరవాణి హాట్ కామెంట్స్

Oknews

Leave a Comment