8 వేల మందితో పార్టీ ప్రతినిధుల సభ..!
అక్టోబరు 9వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పార్టీ ప్రతినిధుల సభను నిర్వహిస్తోంది వైసీపీ. ఇందుకు పార్టీ అధినేత, సీఎం జగన్ హాజరుకానున్నారు. దాదాపు 8 వేల మంది పార్టీ ప్రతినిధులు హాజరవుతారని తెలుస్తోంది. ప్రజాప్రతినిధులను, నేతలను, శ్రేణులను ఉద్దేశించి… జగన్ మాట్లాడటంతో పాటు కీలక అంశాలపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ప్రధానంగా వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు నేతలతో పాటు కేడర్ ను సిద్ధం చేసేలా ప్రసగించే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ కీలక సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంఛార్జులు, రీజనల్ కోఆర్డినేటర్లతో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ విభాగాల నేతలు కూడా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో “వై ఏపీ నీడ్స్ జగన్ క్యాంపైన్’ కార్యక్రమంపై లోతుగా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే నినాదాన్ని క్షేత్ర స్థాయిలో బలంగా తీసుకెళ్లే విధంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయనున్నారు.