Uncategorized

ఎన్నికల సమరానికి సై అంటున్న వైసీపీ, ఈ నెల 26 నుంచి బస్సు యాత్రలు!-amaravati ysrcp bus yatra starts from october 26th says cm jagan to party leaders ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


రెండు నెలల పాటు బస్సు యాత్రలు

రానున్న రెండు నెలల పాటు వైసీపీ శ్రేణులు ప్రజల్లో ఉంటూ బస్సు యాత్రలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. బస్సు యాత్ర సమావేశాల్లో ఎమ్మెల్యే, పార్టీ ఇన్ ఛార్జ్ తో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు మాట్లాడాలన్నారు. నాలుగన్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. వచ్చే ఎన్నికలు పేదవాడికి, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం అన్నారు. సామాజిక న్యాయం, మహిళా సాధికారిత అంశాలను నేతలు ప్రస్తావించాలని నేతలకు మార్గ నిర్దేశం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అవగాహన సమావేశాల నిర్వహించాలన్నారు. ఈ సమావేశాల్లో వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు హాజరవ్వాలన్నారు. స్థానిక నేతలను సమన్వయం చేస్కుండా బస్సు యాత్రలను విజయవంతం చేయాలని సీఎం జగన్ సూచించారు. వైసీపీ బస్సు యాత్రల నిర్వహణ తేదీలు, సమావేశాలపై ప్రణాళిక రూపొందించాలని సీఎం జగన్ ముఖ్యనేతలను ఆదేశించారు. బస్సు యాత్రలను సమన్వయం చేసుకునేందుకు ప్రాంతాల వారీగా బాధ్యుల్ని నియమించారు. దీంతో పాటు ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తల సానుకూలత, వ్యతిరేకతలేంటని సీఎం జగన్ ఆరా తీశారు. ప్రధానంగా గ్రూపులు, వర్గ విభేదాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలపై వ్యతిరేకతపై ఆరా తీసినట్లు సమాచారం.



Source link

Related posts

విజయవాడ డివిజన్‌లో పలు రైళ్ల రద్దు-several visakhapatnam trains have been canceled for three days in vijayawada railway division ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Bad Teacher:విద్యార్ధినిపై ఉపాధ్యాయుడి లైంగిక దాడి,బిడ్డకు జన్మనిచ్చిన బాలిక

Oknews

చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ.. రేపటికి తీర్పు రిజర్వ్‌-ap high court reserves judgment on chandrababu naidu bail petition ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment