Health Care

ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గడం లేదా.. కారణాలు ఇవే కావచ్చు


దిశ, ఫీచర్స్ : ఈ మధ్యకాలంలో చాలామంది ఎదుర్కొనే సమస్యల్లో ఊబకాయం ఒకటి. మారిన కల్చర్ తో పాటు మానవుని శరీర ఆకృతులు కూడా మారిపోతున్నాయి. ఉండాల్సిన బరువు కన్నా అధిక బరువు పెరిగి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో పెరిగిన బరువును తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కొంతమంది బరువును తగ్గించుకోవడంలో విఫలమై నిరుత్సాహ పడతారు. బరువు తగ్గేందుకు ఒక్కపూట భోజనం మానేయడం, జిమ్‌కి వెళ్లడం, వ్యాయామం చేయడం, వాకింగ్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు. నిజానికి బరువు తగ్గేందుకు చేసే ప్రయత్నంలో తెలియకుండానే ఇలాంటి అనేక తప్పులు చేస్తుంటాం. దాంతో మీరు అనుకున్న విధంగా బరువు తగ్గలేరు. ఇంతకీ ఆ పొరపాట్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అధిక కేలరీలు తీసుకోవడం..

మీరు మీ ఆహారంలో అధిక కేలరీలు తీసుకుంటే మీరు బరువు తగ్గ లేకపోవడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు.

తగినంత నిద్ర ఉండకపోవడం..

ఆరోగ్యంగా ఉండాలంటే సరైన నిద్రకూడా అంతే ముఖ్యం. అదేవిధంగా బరువును నియంత్రించడానికి తగినంత నిద్ర కూడా ఉండాలి. ఎందుకంటే నిద్ర లేకపోవడం వల్ల మీరు హార్మోన్ల అసమతుల్యత గురవుతారు. అటువంటి పరిస్థితులలో, బరువు పెరుగుతారు. అందుకే రాత్రిపూట 7 నుండి 8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం.

తగినంత నీరు తాగకపోవడం..

బరువు తగ్గడానికి, తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. నీరు మీ జీవక్రియను పెంచుతుంది. ఇది ఆకలిని తగ్గించడంలో, శరీరం నుండి మలినాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. అందుకే ప్రతిరోజూ 3 నుండి 4 లీటర్ల నీరు త్రాగాలి.

స్థిరత్వం ముఖ్యం..

బరువు తగ్గడానికి స్థిరత్వం చాలా ముఖ్యం. మీరు బరువు తగ్గాలనుకుంటే, మీరు మీ ఆహారం, వ్యాయామం, జీవనశైలికి అనుగుణంగా ఉండాలి. అంటే బరువు తగ్గించుకునే ప్రయత్నాన్ని మధ్యలోనే వదిలేయకూడదు.

అనారోగ్య సమస్యలు..

శరీరంలో కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు బరువు పెరుగుతుంటారు. అలా పెరిగిన బరువును తగ్గించడం కాస్త కష్టంతో కూడుకున్న పని. హైపోథైరాయిడిజం, పీసీఓఎస్ వంటి కొన్ని సమస్యలు బరువు పెరగడానికి కారణమవుతాయి. కష్టపడి ప్రయత్నించినప్పటికీ మీ బరువు తగ్గకపోగా నిరంతరం బరువు పెరుగుతూనే ఉంటారు. అటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.



Source link

Related posts

2-2-2 Rule : బరువు తగ్గాలని అనుకుంటున్నారా? మోస్ట్ ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తున్న పద్ధతి..

Oknews

భోజనంలో అప్పడాలు తినే వారికి వీటి గురించి తెలుసా

Oknews

గొడ్డు కారం తినేవారికి గుడ్ న్యూస్.. దీని వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Oknews

Leave a Comment