ఎప్పుడూ బలహీనంగా అనిపిస్తుందా? ఈ 3 విటమిన్ల లోపమే కారణమట..!


posted on Aug 6, 2024 9:29AM

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం, నిద్ర, అలవాట్లు బాగుండాలి.  అయితే ఇవన్నీ చక్కగా పాటిస్తున్నా సరే బలహీనత ఫీలవుతూ ఉంటారు. ఏ చిన్న పని చేసినా అలసట అనుభూతి చెందడం, ఒళ్లంతా నొప్పులుగా అనిపించడం,  ఏ పని చేయాలన్నా ఆసక్తి లేకపోవడం, బాగా నీరసంగా ఉందని కంప్లైంట్ చేయడం చేస్తుంటారు.  అయితే ఇది కేవలం మూడు రకాల విటమిన్లు లోపించడం వల్ల ఎదురయ్యే సమస్య అని ఆహార నిపుణులు చెబుతున్నారు.  అవేంటో తెలుసుకుంటే..


విటమిన్-డి..


విటమిన్-డి అనేది సూర్యరశ్మి శరీరానికి అందడం ద్వారా శరీరంలో తయారవుతుంది.  విటమిన్-డి లోపిస్తే రోజంతా బలహీనంగా, అలసటగా అనిపిస్తుంది. వర్షాకాలంలో విటమిన్-డి లోపం వచ్చే అవకాశాలు ఎక్కువ. అదే విధంగా ఎక్కువగా ఇంట్లోనే ఉండేవారు,  ఇల్లు దాటి బయటకు రానివారు, సూర్యరశ్మికి, బయటి వాతావరణానికి  దూరంగా ఉండేవారు విటమిన్-డి లోపానికి ఎక్కువగా గురి అవుతారు. ఈ విటమిన్-డి లోపాన్ని అధిగమించడానికి పుట్టగొడుగులు,  పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, పాలు, గుడ్లు, చేపలు తీసుకోవాలి.


విటమిన్-బి12..

విటమిన్-బి12 శరీరంలో నాడీ వ్యవస్థకు చాలా ముఖ్యమైనది.  ఇది లోపిస్తే నరాల సమస్యలు వస్తాయి. ఇది లోపిస్తే శరీరం ఎప్పుడూ అలసట అనుభూతి చెందుతూ ఉంటుంది. విటమిన్-బి12 లోపాన్ని అధిగమించడానికి  గుడ్లు, చేపలు, మాంసం, పాలు, గింజలు మొదలైనవి తీసుకోవాలి.

విటమిన్-సి..

విటమిన్-సి లోపిస్తే ఎప్పుడూ నిద్ర మత్తుగా అనిపిస్తుంది.  అంతేకాదు ఎక్కువగా నిద్రపోతారు.  కండరాలలో నొప్పి, అలసట ఎక్కువగా ఉంటుంది. విటమిన్-సి ఆధారిత పండ్లు, కూరగాయలు బాగా తీసుకోవాలి. ముఖ్యంగా జామ, నారింజ, బ్రోకలీ బాగా తినాలి.

                                                    *రూపశ్రీ.



Source link

Leave a Comment