Health Care

ఎరుపు రంగులో అరుదైన నాగుపాము.. ఒక్కసారి కాటువేసిందో అంతే సంగతి..


దిశ, ఫీచర్స్ : ప్రపంచవ్యాప్తంగా మనం ఎన్నో రకాల వింత జంతువులను చూస్తూ ఉంటాం. ఒకే జాతికి చెందిన ఎన్నో రకాల జంతువులు తారసపడుతూ ఉంటాయి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా మూడు వేలకు పైగా సర్ప జాతులు ఉన్నాయని, పరిశోధనల్లో తేలిందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అయితే ఆ జాతులన్నీ విషపూరితం కాదు. వాటిలో కొన్ని మాత్రమే విషపూరితమైనవని చెబుతున్నారు. అలాగే భారతదేశంలో 69 రకాల జాతుల పాములు అత్యంత ప్రమాదకరమైనవని పరిశోధకులు చెబుతున్నారు.

ఇకపోతే చిన్న పాము పిల్లను చూసినా అంత దూరం ఎగిరి పడుతుంటారు. పాము కనిపిస్తే చాలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని పరుగులు తీస్తుంటారు. అయితే 69 రకాల జాతుల్లో ఈ మధ్య కాలంలో ఓ అరుదైన జాతి పాము కొందరి కంట పడింది. ఇప్పుడు ఆ పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీడియోలో కనిపించే ఆ పాము ఎరుపు రంగులో చిన్న పడగ విప్పి అందంగా కనిపిస్తుంది. అయితే ఇది చూసేందుకు ముద్దుగా ఉన్నా విషపూరితమైన నాగుపామని చెబుతున్నారు నిపుణులు. ఎప్పుడు కనిపించని ఎరుపు రంగు పామును చూసిన నెటిజన్లు ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఎరుపు రంగు పామును ఓ వ్యక్తి పట్టుకున్నాడు. ఆ పామును ఆ వ్యక్తి పట్టుకుని లాగగానే ఒక్కసారిగా పాము పడగ విప్పింది.

ఇక ఈ రెడ్ స్పిటింగ్ కోబ్రా అరుదైన జాతికి చెందిన పాము అని యానిమల్ డైవర్సిటీ నివేదికలో తెలిపారు. ఇది కేవలం ఆఫ్రికా ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ పామును శాస్త్రీయ నామంలో నజా పల్లీడ అని పిలుస్తారు. ఉగాండా, సూడాన్, ఈజిప్ట్, టాంజానియా ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయట. అన్ని నాగుపాముల్లో ఈ పాము అత్యంత విషపూరితమైనది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో @snake_fraind అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా షేర్‌ చేశారు.





Source link

Related posts

పెదాలు నల్లబడటానికి కారణాలేంటో తెలుసా.. దాన్ని పోగొట్టే మార్గం తెలుసుకోండి..

Oknews

సింగిల్ వీల్ స్కూటీ.. ఆ వ్యక్తి ఎలా నడుపుతున్నాడో చూడండి..

Oknews

ఈవినింగ్ స్నాక్స్.. గరం గరం బ్రెడ్ మసాల చిప్స్.. ఇలా రెడీ చేయండి!

Oknews

Leave a Comment