వార్షిక ఆదాయ అంతరం నిమిత్తం ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్, ఈపీడీసీఎల్ డిస్కమ్‌లు Discoms రూ.13,624.67 కోట్లు ప్రతిపాదించగా రూ.15,299.18 కోట్లకు కమిషన్ ఆమోదించిందన్నారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఈ మూడు డిస్కమ్ లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13,589.18 కోట్ల మేర సబ్సిడీ అందించనుందని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సబ్సిడీ క్రింద రూ.3,453.96 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుందన్నారు