రంగారెడ్డి జిల్లాలోప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతీ సోమవారం రంగారెడ్డి (Rangareddy)కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జిల్లా ఎన్నికల ప్రధానాధికారి, కలెక్టర్ శశాంక తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా ప్రజావాణిని నిలిపివేస్తున్నట్లు తెలిపారు. లోక్ సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ప్రజావాణి (Prajavani)రద్దు చేయనున్నట్లు తెలిపారు. అయితే మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక కారణంగా ఎలక్షన్ కోడ్ ఫిబ్రవరి 26 నుంచే అమల్లోకి వచ్చింది. ఈ కారణంగా ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు గుర్తుచేశారు. తాజాగా లోక్ సభ ఎన్నికల షెడ్యూల్(Lok Sabha Elections) రావడంతో ఎన్నికల దృష్ట్యా ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తైన తర్వాత ప్రజావాణిని తిరిగి కొనసాగిస్తామన్నారు.
Source link