టాలీవుడ్ లో శివుడి పాత్ర ఎవరు చేస్తే బాగుంటుంది.. ఆల్రెడీ బాలకృష్ణ పేరు ఒకరు చెప్పారు. కానీ విశ్వక్ సేన్ మాత్రం ఆ పాత్ర నేనే చేస్తా అన్నాడు. దీనికి అతడు ఓ లాజిక్ కూడా చెప్పుకొచ్చాడు.
“గామి కోసం వారణాసిలో 15 రోజులు అఘోరా పాత్రలో తిరిగాను. అప్పటికి ఫలక్ నుమా దాస్ కూడా రిలీజ్ కాలేదు. కాబట్టి నన్ను ఎవ్వరూ గుర్తుపట్టే ఛాన్స్ లేదు. నన్ను అఘోరా అనుకొని చాలామంది వచ్చి బిక్ష వేశారు. ఆ 15 రోజులు చాలా ఎమోషనల్ గా ఉన్నాను. ఓ రకమైన జోన్ లో ఉన్నాను. అలా శివుడితో నాకు కనెక్షన్ ఏర్పడింది.”
బాలకృష్ణ, విశ్వక్ సేన్ తమ సినిమాల్లో అఘోరాలుగా కనిపించారు. అప్పట్నుంచి శివుడి పాత్రతో బాలకృష్ణ ఓ సినిమా చేస్తే బాగుంటుందంటూ అతడి ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి బాలకృష్ణ హార్డ్ కోర్ ఫ్యాన్ విశ్వక్ కూడా జాయిన్ అయ్యాడు.
శివుడి పాత్రలో బాలయ్య బాగుంటారని, ఒకవేళ ఆయన డ్రాప్ అయితే తను శివుడి పాత్ర పోషించడానికి రెడీ అన్నాడు. నిజానికి ప్రస్తుతానికి ఎవ్వరూ శివుడి పాత్రతో సినిమాలు చేయడం లేదు. కాకపోతే ఇండస్ట్రీలో చిన్న డివోషనల్ ట్రెండ్ కూడా నడుస్తోంది కాబట్టి, ఎవరికైనా శివుడి పాత్ర అవసరం పడితే విశ్వక్ రెడీ అంటున్నాడు.
The post ఎవరో ఎందుకు.. నేనే శివుడ్ని appeared first on Great Andhra.