‘డబుల్ ఇస్మార్ట్’ (Double iSmart)లోని ‘మార్ ముంత చోడ్ చింత’ సాంగ్ లో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR) డైలాగ్ ‘ఏం చేద్దామంటావ్ మరి’ ఉపయోగించడంపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. కేసీఆర్ ను కించపరిచేలా ఈ సాంగ్ ఉందని, మూవీ టీంపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ నేతలు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా ఈ వివాదంపై ‘డబుల్ ఇస్మార్ట్’ సంగీత దర్శకుడు మణిశర్మ స్పందించారు.
మాజీ సీఎం కేసీఆర్ గారు అంటే తమకి అభిమానమని మణిశర్మ అన్నారు. అది ఐటెం సాంగ్ కాదని, హీరో హీరోయిన్ మధ్య డ్యూయెట్ అని చెప్పారు. సీరియస్ మేటర్ ని కూడా కేసీఆర్ గారు సరదాగా చెప్తారు. వినోదం కోసమే ఆయన మాటను ఈ పాటలో పెట్టాం. ఇన్నేళ్ల సినీ కెరీర్ లో నేనెప్పుడూ ఎవరిని కించపరచలేదు. కేసీఆర్ గారి మీద అభిమానంతోనే ఈ పాటలో ఆయనను తలచుకున్నామని మణిశర్మ చెప్పుకొచ్చారు.