ఆర్జీవీ వివాదాల డైరెక్టర్ గా పేరు తీచుకోవడమే కాదు..ఎవరు ఎలాంటి ప్రశ్నలు అడిగినా దానికి కూడా అలాగే ఆన్సర్స్ ఇస్తాడు అనే పేరు కూడా తెచ్చుకున్నాడు. అలాంటి ఆర్జీవీ ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని బాగా వాడేస్తున్నాడు. ఏఐ టెక్నాలజీ అంటే ఇంకేముంది ఎలాంటి ముఖాన్నైనా మంచి బ్యూటిఫుల్ గా మంచి ఫెయిర్ గా మార్చేయడమే కదా..ఆర్జీవీ ఆ పనులు చేయడంలో మంచి దిట్ట అని నిరూపించుకున్నారు.
తనకు ఇష్టమైన హీరో హీరోయిన్స్ చిత్రాలను ఇలా ఏఐ రూపంలోకి మార్చి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తున్నాడు. రీసెంట్ గా కొన్ని రోజుల క్రితం అక్కినేని నాగేశ్వరావు చిత్రాన్ని ఏఐలోకి మార్చి దానికి బ్యాక్ గ్రౌండ్ లో పవన్ కళ్యాణ్ సాంగ్ పెట్టాడు. ఇప్పుడు తన దేవకన్య ఐన శ్రీదేవిని ఏఐలోకి మార్చేశాడు. శ్రీదేవి పిక్ చూసినవాళ్లంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. శ్రీదేవి అంటే ఆర్జీవీకి ఎంత పిచ్చో మనందరికీ తెలుసు.. ఇక ఆర్జీవీని తిట్టేవాళ్ళు తిడుతున్నారు, పొగిడేవాళ్లు పొగుడుతున్నారు. ఐతే కొందరు మాత్రం శ్రీదేవి ఎన్నో ఫేస్ సర్జరీస్ చేయించుకున్నారు..ఆర్టిఫీషియల్ బ్యూటీ అంటే ఇంకొందరు ఆ కామెంట్స్ ని ఖండిస్తున్నారు.
ఇక ఒక నెటిజన్ మాత్రం ఆర్జీవీకి ఒక కొత్త ఐడియా ఇచ్చారు..”ఏఐలో శ్రీదేవి పోస్టర్స్ ని డిజైన్ చేసి ఒక మూవీ ఎందుకు తియ్యకూడదు. అలా ఒక సారి ట్రై చేయండి. ఏఐ స్టార్స్ తో మూవీ చేసిన ఫస్ట్ డైరెక్టర్ మీరే అవుతారు కదా ” అని ఒక మెసేజ్ లో చెప్పారు. కొంత మంది “ఈ శ్రీదేవి ఏఐ పిక్ చూసి ఈ లుక్ లో శ్రీదేవి పోలికల కన్నా రకుల్ ప్రీత్ సింగ్ పోలికలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దేవుడు శ్రీదేవి కంటే అందమైన, టాలెంటెడ్ పర్సన్ ఇంకొకరిని తయారు చేయనేలేదు..శ్రీదేవి ఈ ఏఐ పిక్ లో కంటే కూడా బయటే చాలా అందంగా ఉంటారు” అని కామెంట్స్ చేస్తున్నారు.