APOSS SSC Inter Results : ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఎస్ఎస్సీ, ఇంటర్(ఏపీఓఎస్ఎస్) ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ఈ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఎస్.ఎస్.సి పరీక్షలకు 15,058 విద్యార్థులు హాజరుకాగా 63.30 శాతం అంటే 9,531 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు 27,279 విద్యార్థులు హాజరు కాగా 18,842 మంది(69.07 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం అధికారిక వెబ్ సైట్ https://apopenschool.ap.gov.in లో విద్యార్థులు ఫలితాలు తెలుసుకోవచ్చు. పరీక్షలో విజయం సాధించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.