89 పోస్టుల భర్తీ
ఏపీపీఎస్సీ గ్రూప్-1(APPSC Group-1 Exam) పరీక్షకు మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. వీరిలో 1,26,068 మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. 91,463 మంది ప్రిలిమ్స్(Prelims) పరీక్షకు హాజరయ్యారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ కు 72.55 శాతం హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని 18 జిల్లాల్లోని 301 కేంద్రాలలో పరీక్ష నిర్వహించారు. ఏపీపీఎస్సీ 81 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(AP Group-1 Notification) విడుదల చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఎనిమిది కొత్త ఖాళీలను జోడించింది. దీంతో ఏపీపీఎస్సీ గ్రూప్-1 ద్వారా భర్తీ చేయాల్సిన మొత్తం ఖాళీల సంఖ్య 89కు చేరింది. ప్రిలిమ్స్ ప్రైమరీ కీల విడుదల చేసిన ఏపీపీఎస్సీ అభ్యంతరాలు స్వీకరిస్తోంది. ఆ తర్వాత కమిషన్ అభ్యర్థుల అభిప్రాయాన్ని సమీక్షిస్తుంది. అనంతరం గ్రూప్-1 స్క్రీనింగ్ పరీక్ష తుది కీ, ఫలితాలు విడుదల చేయనుంది. ప్రిలిమ్స్ ఫలితాల విడుదల తర్వాత ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేయనుంది.