అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించిన వివరాలు
- రిక్రూట్‌మెంట్ ప్రకటన : ఐసీడీఎస్, చిత్తూరు జిల్లా
- ఉద్యోగాలు : అంగన్‌వాడీ పోస్టులు
- మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 87 (అంగన్‌వాడీ వర్కర్-11, మినీ అంగన్‌వాడీ వర్కర్-18, అంగన్‌వాడీ హెల్పర్-58)
- అర్హత : పదో తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి. స్థానిక ప్రాంత పరిధికి చెందిన మహిళ అయి ఉండాలి.
- కనీస వయస్సు : 21 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు : 35 సంవత్సరాలు
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన పోస్టులు ఉన్న ప్రాంతాల్లో 21 ఏళ్లు నిండినవారు లేకపోతే, 18 ఏళ్ల నిండిన వారిని కూడా తీసుకుంటారు.
- దరఖాస్తులు ప్రారంభం తేదీ : జులై 4
- దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : జులై 19 (సాయంత్రం 5 గంటల లోపు )
- గౌరవ వేతనం : అంగన్ వాడీ వర్కర్‌కు రూ.11,500, మినీ అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.7,000, అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7,000
- ఎంపిక విధానం : ఎటువంటి పరీక్ష ఉండదు. ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభా ఆధారంగానే ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
- దరఖాస్తు ఆఫ్‌లైన్‌లోనే చేయాలి. అభ్యర్థి స్వయంగా వెళ్లి సంబంధిత సీడీపీఓ కార్యాలయంలో తమ అప్లికేషన్ అందజేయాలి. అర్హత గల వారు దగ్గరిలోని సీడీపీఓ కార్యాలయంలోనే అప్లికేషన్ తీసుకొని, దాన్ని పూర్తి చేసి అన్ని రకాల ధ్రువపత్రాలను జత చేసి వారికి అందజేయాలి.
జత చేయాల్సిన ధ్రువపత్రాలు
ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పుట్టిన తేదీ, వయస్సు ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, పదో తరగతి మార్కుల జాబితా, నివాస స్థల ధ్రువీకరణ పత్రం, వితంతువు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రం, వికలాంగురాలైతే పీహెచ్ సర్టిఫికేట్, వితంతువు అయి పిల్లలు ఉన్నట్లు అయితే పిల్లల వయస్సు ధ్రువీకరణ పత్రం జిరాక్స్ కాపీలను దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది.