Top Stories

ఏపీలో కూడా కాంగ్రెసు టికెటుకు ఒక రేటు!


సాధారణంగా పార్టీలో ఎమ్మెల్యే టికెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉంటే.. పార్టీకి ఫండ్ అడగడమూ, ఎన్నికల ఖర్చులకు నిధులను డిపాజిట్ గా చూపించమని అడగడమూ ఇత్యాది వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. పోటీ ఉన్నా లేకపోయినా.. పోటీ చేయదలచుకున్న అభ్యర్థులు.. దరఖాస్తు చేసుకోవడాన్నీ, ఆ దరఖాస్తుతో పాటూ నిర్ణీత ఫీజు చెల్లించడాన్ని కాంగ్రెసు పార్టీ వ్యవస్థీకృతంగా మార్చేసింది.

కర్నాటక ఎన్నికల నాటి నుంచి ఈ వైఖరి నడుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో కూడా  దరఖాస్తుదారుల నుంచి భారీగా ఫీజులు వసూలుచేశారు. అక్కడంతా ఓకే గానీ.. పార్టీ శవాసనం వేసి ఉన్న ఏపీలో కూడా ఇలాంటి ఫీజుల వ్యవహారాన్ని అమలు చేయబోతున్నారు.

ఒక రకంగా చెప్పాలంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ తరువాత.. ఏపీలో ఎన్నికలకు సిద్ధం అవుతున్న పార్టీ కాంగ్రెసు మాత్రమే. వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసేస్తుండగా.. కాంగ్రెసు దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించింది. అయితే ఏపీలో కూడా టికెట్ దరఖాస్తులకు ఒక రేటు నిర్ణయించారు.

పార్లమెంటు స్థానాలకు జనరల్ అభ్యర్థులైతే పాతికవేలు, ఎస్సీ, ఎస్టీలు 15 వేలు చెల్లించాలట. ఎమ్మెల్యే టికెట్ల కోసం అయితే.. జనరల్ పదివేలు, ఎస్సీ, ఎస్టీలకు 5 వేలు మాత్రమే.  రేటు పెట్టినంత మాత్రాన.. కాంగ్రెసు టికెట్ల కోసం జనం ఎగబడి వస్తున్నారేమో అనుకుంటే పొరబాటే.

పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణికం ఠాగుర్ విజయవాడలోని పార్టీ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణకు కౌంటర్ తెరచి కూర్చున్న తొలిరోజున కేవలం మూడంటే మూడే దరఖాస్తులు వచ్చాయి. మడకశిర, గుంటూరు తూర్పు, బద్వేలు సీట్లకోసం  మాజీ ఎమ్మెల్యేలు సుధాకర్, మస్తాన్వలి, కమలమ్మ మొదటిరోజు దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తులకు ఇంకా రెండు వారాల గడువున్నదని, అంతా పూర్తయిన తర్వాత దరఖాస్తుల్ని కేంద్ర ఎన్నికల కమిటీకి పంపితే, వారు ఖరారు చేస్తారని మాణికం ఠాగుర్ అంటున్నారు.

ఎంతగా షర్మిల చేతిలో పగ్గాలు పెట్టినా గానీ.. కాంగ్రెసు పార్టీకి మొత్తం 175 స్థానాల్లో అభ్యర్థులు దొరుకుతారని అనుకోవడమే పెద్ద పొరబాటు. అయినా సరే ఆ పార్టీ వారి మాటలు మాత్రం చాలా గంభీరంగా ఉంటున్నాయి. షర్మిల అయితే ఏకంగా అధికారంలోకే వచ్చేస్తాం అని కూడా అంటున్నారు.

ఏదో కాంగ్రెసు బతిమాలి టికెటు ఇస్తే.. పార్టీ చచ్చిపోలేదని చాటి చెప్పుకోవడానికి నియోజకవర్గాల్లో పోటీచేసే మనుషులు దొరుకుతారు గానీ.. డబ్బులిచ్చి దరఖాస్తులు కొనుక్కుని, అధిష్ఠానం ఎంపిక కోసం నిరీక్షిస్తూ కాంగ్రెసు తరఫున పోటీచేయడానికి ఎవరు ముందుకు వస్తారు అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.



Source link

Related posts

బాబు ప్ర‌శంస‌…ప‌వ‌న్ ఖేల్ ఖ‌తం!

Oknews

ప‌వ‌న్‌, లోకేశ్ క‌లిస్తే.. ద‌బిడి ద‌బిడేనా!

Oknews

బాబు స‌భ జ‌న‌స‌మీక‌ర‌ణ‌కు.. వాళ్ల‌తో డ్యాన్స్‌!

Oknews

Leave a Comment