అయినప్పటికీ మద్యం బ్రాండ్లు, నాసిరకం మద్యంపై ప్రతిపక్షాల విమర్శలు ఆగలేదు. ఎన్నికల ప్రచారంలో మద్యం బ్రాండ్లు, నాణ్యతపైనే ప్రధాన చర్చ జరిగింది. చంద్రబాబు తాము అధికారంలోకి రాగానే, పాత బ్రాండ్లే తెస్తామని, నాణ్యతతో కూడిన మద్యాన్ని తక్కువ ధరకు అందిస్తామని హామీ ఇచ్చారు. నకిలీ బ్రాండ్లతో కల్తీ మద్యాన్ని రాష్ట్రంలో విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడుతున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం రాగానే నకిలీ బ్రాండ్‌లను రద్దు చేసి, నాణ్యమైన బ్రాండ్‌లను తీసుకొస్తామని హామీ ఇచ్చారు.