విశాఖపట్నం, తణుకు, గుంటూరు, తిరుపతి నగరాల్లో టీడిఆర్ బాండ్ల జారీలో భారీగా అక్రమాలు జరిగినట్టు ప్రభుత్వం గుర్తించింది. తణుకులో జరిగిన అక్రమాలపై వేసిన అధికారుల కమిటీ ప్రాథమిక నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి అందచేసింది. నివేదికపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయనున్నట్టు మంత్రి నారాయణ ప్రకటించారు.