రాష్ట్రంలో 169 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా, 21 స్వయంప్రతిపత్తి (అటానమస్) కాలేజీలు ఉన్నాయి. చార్టర్డ్ అకౌంట్స్( సీఏ) చేయాలనుకున్న విద్యార్థులు బీకాం జనరల్‌లోనే ప్రవేశాలు పొందుతారని, కొత్తగా వచ్చిన మార్పు కారణంగా జీఎస్‌టీ, ఈ-ఫైలింగ్ వంటి అంశాలపై పాఠ్యాంశాలు ఉన్నాయి. దీనివల్ల ప్రైవేట్ ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల అన్ని కళాశాలల్లోనూ బీకాం జనరల్ కోర్సును కొనసాగించాలని విద్యార్థులు, అధ్యపకులు కోరుతున్నారు. ఇప్పటికే చాలా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అధ్యపకులు ఉన్నారు.