Andhra Pradesh

ఏపీలో ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు చేసుకోండి ఇలా..-notification released for admissions in fine arts courses in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


AP ADCET 2024: ఆంధ్రప్రదేశ్‌ ఆర్ట్ అండ్ డిజైన్‌ కామన్ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ను ఏపీ ఉన్నత విద్యా మండలిAPSCHE విడుదల చేసింది. కడపలోని డాక్టర్ వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ DR.YSRAFAU 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షను నిర్వహించనుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ట్‌ అండ్‌ డిజైన్ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ AP ADCET 2024ప్రవేశ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. కడప వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ ప్రవేశ పరీక్షను నిర్వహించనుంది.

ఏపీ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఫైన్‌ ఆర్ట్స్‌ Fine Arts కోర్సుల్లో ప్రవేశాల కోసం అడ్ సెట్‌ 2024 నిర్వహిస్తున్నారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా బ్యాచిలర్ ఆఫ్‌ ఫైన్ ఆర్ట్స్‌, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్‌ Design కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. ఇంటర్మీడియట్ తత్సమాన విద్యార్హత కలిగిన వారు కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌లో ఏ గ్రూపులో చదివిన వారైనా ఈ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఆరు కోర్సుల్లో అడ్మిషన్లను AD CET 2024 ద్వారా కల్పిస్తారు. వీటిలో 1.అప్లైడ్ ఆర్ట్‌, 2.పెయింటింగ్‌, 3. ఫోటోగ్రఫీ, 4.స్కల్ప్చర్,5. యానిమేషన్, 6.బాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఒక్కో కోర్సులో 60 సీట్లు ఉంటాయి. ఈ కోర్సులకు వార్షిక ఫీజుగా రూ.37వేలు చెల్లించాల్సి ఉంటుంది. వీటితో పాటు మరో 15శాతం సూపర్ నూమరీ సీట్లకు కూడా అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ సీట్లను ఎన్నారైలు, ఇతర రాష్ట్రాల విద్యార్ధులకు కేటాయిస్తారు.

ఫీజు రియింబర్స్‌మెంట్…

తల్లిదండ్రులకు రెండు లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుంది. బీసీ, ఓసీ విద్యార్ధులకు లక్షలోపు ఆదాయం ఉంటే రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుంది. ప్రభుత్వం ఫీజు రియంబర్స్‌మెంట్ చెల్లించకపోతే విద్యార్ధులకే కోర్సు ఫీజులు చెల్లించాలని నోటిఫికేషన్‌లో స్పష్టత ఇచ్చారు. అడ్మిషన్లు పొందిన విద్యార్ధులకు కంప్యూటర్ ల్యాబ్ ఫీజు వెయ్యి రుపాయలు, స్టడీ టూర్ వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది.

విద్యార్ధులు ‎ఏదైనా కారణాలతో అడ్మిషన్ రద్దు చేసుకుంటే వారు చెల్లించిన ఫీజులో 10శాతం మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని వాపసు చేస్తారు. అడ్మిషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత ఎవరైనా అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటే యూనివర్శిటీకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించిన తర్వాత మాత్రమే వారి సర్టిఫికెట్లు తిరిగి ఇస్తారు. అలాంటి విద్యార్ధులకు ప్రత్యేకంగా టీసీ ఇస్తారు.

ఆర్ట్ అండ్ డిజైన్‌ సెట్ 2024కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో ఏ గ్రూపులోనైనా చదివి ఉండొచ్చు. ఆన్‌లైన్‌ మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ‌ డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశ పరీక్షను 100మార్కులకు నిర్వహిస్తారు. రెండు గంటల వ్యవధిలో సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

దరఖాస్తుల స్వీకరణ…

ఏప్రిల్ 23నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. మే 22వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. లేట్‌ ఫీజుతో దరఖాస్తుల సమర్పణకు మే 31వ తేదీ వరకు గడువు ఉంటుంది. జూన్ 4వ తేదీన హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 13న ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.

ఈ లింకు ద్వారా ADCET 2024కు దరఖాస్తు చేసుకోవచ్చు.. https://cets.apsche.ap.gov.in/ADCET/ADCETHomePages/ImportantDates.aspx

దరఖాస్తు ఫీజు ఇలా…

మే 22వ తేదీలోపు ఎలాంటి ఎలా ఆలస్య రుసుము లేకుండా ఎస్సీ, ఎస్టీలకు రూ.500, బీసీ విద్యార్ధులకు రూ.750, ఓసీలకు రూ.1000 ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. రూ.500ఆలస్య రుసుముతో మే 23 నుంచి 28వరకు, రూ.వెయ్యి ఆలస్యరుసుముతో మే 29 నుంచి మే 31వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అన్ని రకాల ఫీజుల్ని ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని AD CET 2024 కన్వీనర్ ప్రొఫెసర్ ఈసీ సురేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు.

నమూనా ప్రశ్నా పత్రాలు, సిలబస్‌ ఇతర వివరాలను నోటిఫికేషన్ ‌లో అందుబాటులో ఉంచారు. మోడల్ పేపర్‌, వాటి కీలను నోటిఫికేషన్‌లోనే అందుబాటులో ఉంచారు.

ఈ లింకు ద్వారా ADCET 2024కు దరఖాస్తు చేసుకోవచ్చు.. https://cets.apsche.ap.gov.in/ADCET/ADCETHomePages/ImportantDates.aspx

 



Source link

Related posts

Janasena Bjp Alliance: జనసేనతో పొత్తు కొనసాగుతుందన్న పురంధేశ్వరి.. సీట్ల సర్దుబాటుపై నిర్ణయం అధిష్టానానిదే!!

Oknews

కారులో క్యాష్.. విశాఖ శివార్లలో రెండు కోట్ల నగదు పట్టివేత-two crore cash was seized in the outskirts of visakhapatnam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

జగన్ ఇలా చేస్తే షర్మిల పని అయిపోయినట్టే Great Andhra

Oknews

Leave a Comment