జిఏడిలో రిపోర్ట్ చేయాలని ఆదేశించిన అధికారుల్లో గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, విశాఖ కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, ప్రకాశం జిల్లా కలెక్టర్ ఎం.విజయసునీత, కాకినాడ జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవిలత రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీ రావు ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన మాధవిలత వైసీపీ అనుకూల అధికారిగా ముద్రపడ్డారు. ఉమ్మడి కృష్ణా జాయింట్ కలెక్టర్‌గా సుదీర్ఘ కాలం పనిచేశారు. జగన్ ప్రభుత్వంలో అత్యంత శక్తివంతంగా పనిచేసిన అధికారుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.