ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు బాలురు 2,26,240 మంది హాజరవ్వగా, 1,43,688 మంది పాస్ అయ్యారు. ఉత్తీర్ణత శాతం 64 శాతం. మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షలకు బాలికలు 2,35,033 మంది హాజరవ్వగా… 1,67,187 మంది పాస్ అయ్యారు. 71 శాతం ఉత్తీర్ణత. ఈ ఏడాదీ బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలకు 1,88,849 మంది బాలురు హాజరవ్వగా… 1,44,465 మంది పాస్ అయ్యారు. 75 శాతం ఉత్తీర్ణత. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలకు 2,04,908 మంది హాజరవ్వగా… 1,65,063 మంది పాస్ అయ్యారు. ఉత్తీర్ణత శాతం 81 శాతం. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లోనూ బాలికలే పైచేయి సాధించారు.