రాష్ట్ర వ్యాప్తంగా 1559 పరీక్షా కేంద్రాలు
ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియేట్ పరీక్షలకు 1559 పరీక్షా కేంద్రాల్లో 10,52,221మంది విద్యార్థులు హాజరవుతారని, గత ఏడాదితో పోలిస్తే 47,921 మంది అధికంగా పరీక్షలకు హాజరవుతున్నారన్నారని చెప్పారు. పరీక్షా కేంద్రానికి 100 మీటర్ల సమీపంలో 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ షాపులు తెరవకూడదన్నారు. పరీక్షా కేంద్రంలోకి ఫోన్లు అనుమతి లేదని, సిబ్బంది ఎవరి వద్ద ఫోన్లు ఉండకూడదని ఆదేశించారు. ఈ ఏడాది మార్చి1న జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు 10,52,221 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్షలకు హాజరవుతున్న 10,52,221 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులలో గతేడాది పరీక్షలలో ఉత్తీర్ణులు కానీ 93,875 మంది విద్యార్థులు హాజరవుతారు.