AP KGBV Admissions 2024-25 : ఆంధ్రప్రదేశ్ లో కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల్లో(KGBV Admissions) 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. 6, 11వ తరగతుల్లో ప్రవేశాలు, 7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం నోటిఫికేషన్ (KGBV Notification)జారీ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో 352 కస్తూర్భా గాంధీ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. మార్చి 12 నుంచి దరఖాస్తులు (AP KGBV Applications)ప్రారంభం కాగా, ఏప్రిల్ 11 చివరి తేదీగా నోటిఫికేషన్ లో పేర్కొన్నరు. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్, పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీ, బీపీఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్ లైన్ అప్లికేషన్లను మాత్రమే అడ్మిషన్ల కోసం పరగిణిస్తామన్నారు.