Andhra Pradesh

ఏపీ టెట్ ఫలితాలు, డీఎస్సీ నిర్వహణకు ఈసీకి ప్రభుత్వం లేఖ-అనుమతి రాగానే హాల్ టికెట్లు జారీ!-amaravati ap govt wrote letter to ec permission for tet results dsc exams as per schedule ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


ఈసీ అనుమతికి ప్రభుత్వం లేఖ

ఈ నేపథ్యంలో టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షల నిర్వహణపై ఈసీ (EC)అనుమతి కోరుతూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ లేఖ రాశారు. హైకోర్టు ఆదేశాల(High Court orders) మేరకు టెట్ ఫలితాలు ప్రకటన, డీఎస్సీ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి కోరుతూ ఈసీకి లేఖ రాశామన్నారు. ఎన్నికల సంఘం అనుమతి రాగానే టెట్‌ ఫలితాలు విడుదలతో పాటు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈసీ నుంచి స్పష్టత రాగానే పరీక్ష కేంద్రాల ఎంపిక, హాల్‌ టికెట్లు(DSC Hall tickets) డౌన్‌ లోడ్‌ సదుపాయం అందుబాటులోకి తెస్తామన్నారు. అయితే కొందరు డీఎస్పీ, టెట్(DSC TET Updates) ఫలితాలపై దుష్ప్రచారం చేస్తు్న్నారన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా టెట్ రిజెల్ట్స్, డీఎస్సీని వాయిదా వేయాలని చూస్తుందని దుష్ప్రచారం సరికాదన్నారు. మరోవైపు ఎస్జీటీ పోస్టులకు(SGT) బీఈడీ అభ్యర్థులను అనర్హులుగా హైకోర్టు ప్రకటించింది. ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న బీఈడీ అభ్యర్థులకు త్వరలోనే ఫీజు తిరిగి చెల్లిస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. ఈసీ నిర్ణయం కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.



Source link

Related posts

AP Open SSC Inter Hall Tickets : ఏపీ ఓపెన్ టెన్త్, ఇంటర్ హాల్ టికెట్లు విడుదల- ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!

Oknews

AP Assembly Speaker : ఏపీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు – రాజకీయ ప్రస్థానం ఇదే

Oknews

వాలంటీర్లు లేకున్నా సజావుగా పెన్షన్ల పంపిణీ, వారికి ప్రత్యామ్నయ ఉపాధి చూపిస్తామన్న పవన్ కళ్యాణ్-smooth distribution of pensions in ap alternative employment for volunteers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment