Andhra Pradesh

ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్-భారీగా దసరా సెలవుల ప్రకటన-ap telangana government announced schools colleges dasara holidays list ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


ఏపీలో దసరా సెలవులు

ఏపీ ప్రభుత్వం పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. అక్టోబ‌ర్ 14 నుంచి 24 వరకు స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించింది. దసరా సెలవుల తర్వాత అక్టోబర్ 25న తిరిగి తరగతులు ప్రారంభమవుతాయని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు పాఠశాల విద్యాశాఖ ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఎఫ్ఏ-2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఉమ్మడి ప్రశ్నాపత్రం ఆధారంగా పాత విధానంలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు గంట ముందు స్కూళ్ల ప్రధాన ఉపాధ్యాయులకు పేపర్ల పంపాలని ఎంఈఓలకు విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు పొద్దున్న, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తారు. 6,7,8 తరగతుల విద్యార్థుల మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించగా, 9, 10 తరగతుల విద్యార్థులకు రోజుకు రెండు పరీక్షలు ఉదయం పూట నిర్వహిస్తారు. అక్టోబర్ 10వ తేదీలోపు మూల్యాంకనం పూర్తి చేసి విద్యార్థులకు తెలియజేస్తారు.



Source link

Related posts

AP PCC : వైఎస్ షర్మిల చేతికి పీసీసీ పగ్గాలు

Oknews

Salaries Due: కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి, డేటాఎంట్రీ ఆపరేటర్లకు జీతాలు కూడా ఇవ్వలేదా? పవన్ కళ్యాణ్ ఆగ్రహం

Oknews

కోర్టు కేసులు తేలేది ఎప్పుడు, జీవోఐఆర్‌ తెరుచుకునేది ఎప్పుడు? జాప్యానికి కారణమేంటి?-when will the court cases be decided and when will the goir be opened ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment