Andhra Pradesh

ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!-amaravati news in telugu ap bse released ssc 2024 hall tickets download ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


రాష్ట్ర వ్యాప్తంగా 3473 పరీక్ష కేంద్రాలు

అధికారిక వెబ్ సైట్ www.bse.ap.gov.in నుంచి విద్యార్థులు హాల్‌ టికెట్లు డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు. 2023–24 విద్యా సంవత్సరంలో పదో తరగతి(AP SSC Exams) పబ్లిక్ పరీక్షలకు 6,23,092 మంది రెగ్యులర్‌ విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు. అయితే గతేడాది పదో తరగతి తప్పి తిరిగి రాస్తున్న వారు 1,02,528 మంది రెగ్యులర్‌గా పరీక్షలు రాయనున్నారు. మొత్తంగా ఈసారి 7,25,620 మంది టెన్త్ పరీక్షలకు హాజరుకానున్నారు. పదో తరగతి(10th Exams) పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 3,473 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. మార్చి 18 నుంచి మార్చి 28 వరకు ప్రధాన పరీక్షలు నిర్వహిస్తున్నారు. 29, 30 తేదీల్లో ఓరియంటల్, ఒకేషనల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్ లీక్(Paper Leak) , మాల్ ప్రాక్టీస్ అరికట్టేందుకు విద్యాశాఖ 156 ఫ్లయింగ్‌ స్క్వాడ్స్, 682 సిట్టింగ్‌ స్వాడ్స్‌ను సిద్ధం చేసింది. దీంతో 130కి పైగా పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలను(CC Cameras) ఏర్పాటు చేశారు. వీటితో నిరంతరం పరీక్షల నిర్వహణ తీరును విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించనున్నారు. గత ఏడాది పేపర్ లిక్ వివాదం దృష్టిలో పెట్టుకుని పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.



Source link

Related posts

YS Sharmila Deeksha in Delhi : వైఎస్ షర్మిల ‘ప్రత్యేక హోదా’ దీక్ష

Oknews

దూరం పెట్టాడని ప్రియుడిపై యాసిడ్‌‌తో దాడి చేసిన మహిళ-khammam married woman attacked on lover with acid in guntur ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఎటూ తేల్చని భేటీ… ఏపీలో ఉద్యోగ సంఘాల ఉద్యమబాట యథాతథం… ప్రభుత్వ తీరుపై ఆగ్రహం-gom meeting did not lead to any conclusion unions anger over goverment of ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment