కౌన్సెలింగ్ ముఖ్య తేదీలు :
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, ఆన్‌లైన్ పేమెంట్ సెప్టెంబర్ 20 నుంచి 25వ తేదీల్లో ఉంటాయి.
- సెప్టెంబర్ 24 నుంచి 25వ తేదీ మధ్యలో ఎన్‌సీసీ, పీహెచ్, స్పోర్ట్స్ అభ్యర్థులకు సంబంధించి ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది.
- సెప్టెంబర్ 28, 29 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు
- సెప్టెంబర్ 30వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకునే అవకాశం
- అక్టోబర్ 3వ తేదీన మొదటి విడత సీట్ల కేటాయింపు
- అక్టోబర్ 4 నుంచి 7వ తేదీల మధ్యలో కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి.
- అధికారిక వెబ్ సైట్ https://pecet.tsche.ac.in/
ఈ ఏడాది నిర్వహించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులైన బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పీఈసెట్‌కు 2,865 దరఖాస్తులు చేసుకోగా, 1,769 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,707 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తం 21 కాలేజీల్లో, 2,110 సీట్లు అందుబాటులో ఉన్నాయి.