AP Universities Jobs : ఏపీలోని యూనివర్సిటీల్లోని 3,282 అధ్యాపక పోస్టుల భర్తీకి ఈ నెల 20న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. డిప్యుటేషన్‌పై మరో 70 పోస్టులు భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ సహా అధ్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. గతంలో ఎప్పుడూ ఈ తరహా భారీగా ఖాళీలు భర్తీ చేయలేదన్నారు. యూనివర్సిటీలను పటిష్టం చేసేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. అయితే విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీలో భాగంగా ప్రస్తుతం పనిచేస్తున్న అడ్‌హాక్ అధ్యాపకులకు 10 శాతం వెయిటేజీ మార్కులు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారని హేమచంద్రారెడ్డి వెల్లడించారు. యూనివర్సిటీల్లో సుమారు 2,600 మంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తు్న్నారన్నారు.