రెండు డీఏలు విడుదల
ఎన్నికల వేల ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు(AP Govt Employees) శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు రెండు డీఏలను(DA) విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల ఉత్తర్వులను విడుదల చేసింది. ఏప్రిల్ జీతంతో కలిపి ఒక డీఏ, జులై నెల జీతంతో మరొక డీఏ అందజేయనున్నారు. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కోడ్(Election Code 2024)కు ముందే డీఏపై ప్రకటన చేసింది. కోడ్ కు ముందే ప్రభుత్వం డీఏల విడుదలకు ఆమోదముద్ర వేయటంతో పాటు ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్సీ, డీఏలు, సీపీఎస్ రద్దు (CPS)డిమాండ్ల ఉద్యోగులు గత ఏదేళ్లుగా సమ్మెలు, నిరసనలు చేస్తూనే ఉన్నారు. ఎన్నికలకు ముందే ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు, అంగన్ వాడీలు ప్రత్యక్షంగా నిరసలకు దిగిన సంగతి తెలిసిందే.