Andhra Pradesh

ఏపీ సివిల్ జడ్జి పరీక్షల్లో తెలంగాణ యువతి ఫస్ట్, జూ.సివిల్ జడ్జిగా ఎంపిక-amaravati news in telugu ap civil judge recruitment results telangana woman got first rank ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


AP Civil Judge Recruitment : ఏపీలో సివిల్ జడ్జి నియామక పరీక్ష ఫలితాల్లో తెలంగాణ యువతి సత్తా చాటింది. హైకోర్టు నిర్వహించిన సివిల్ జడ్జి పరీక్షల్లో తెలంగాణ యువతి అలేఖ్య ఫస్ట్ ప్లేస్ సాధించి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. తెలంగాణలోని హనుమకొండకు చెందిన మాధవీలత, పరిమి మనోజ్ కుమార్ దంపతుల కుమార్తె అలేఖ్య.. హైదరాబాద్ లో లా చదివారు. ప్రస్తుతం అలేఖ్య హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదువుతున్నారు. అలేఖ్య తల్లి మాధవీలత రంగారెడ్డి జిల్లా కోర్టులో సీనియర్‌ సివిల్‌ జడ్జిగా పనిచేస్తున్నారు. తల్లి స్ఫూర్తితో తానూ జడ్జి కావాలనుకున్నానని అలేఖ్య తెలిపారు. ఏపీ హైకోర్టు నిర్వహించిన సివిల్ జడ్జి నియామకాల్లో ఫస్ట్ ర్యాంకు సాధించి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. అలేఖ్యను రంగారెడ్డి జిల్లా కోర్టుల న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు దీకొండ రవీందర్, ప్రధాన కార్యదర్శి పట్టోళ్ల మాధవరెడ్డి అభినందించారు.



Source link

Related posts

TDP Prathipati Son: బోగస్‌ బిల్లులతో ఖజానాకు గండి… మాజీ మంత్రి పత్తిపాటి కుమారుడికి 14రోజుల రిమాండ్

Oknews

Anakapalle Murder: మైనర్ బాలిక హత్య కేసు, నిందితుడిని పట్టిస్తే రూ.50వేలు బహుమతి ప్రకటించిన పోలీసులు

Oknews

AP ECET 2024: ఏపీ ఈసెట్‌ నోటిఫికేషన్ విడుదల.. రేపటి నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్, ఏప్రిల్ 15వరకు దరఖాస్తుల స్వీకరణ

Oknews

Leave a Comment