ఏపీ సెట్ పరీక్ష విధానం
ఏపీ సెట్(AP SET 2024) ను రెండు పేపర్లలో నిర్వహిస్తారు. పేపర్-1 జనరల్ స్టడీస్, టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. పేపర్- 2 లో సబ్జెక్ట్ స్పెషలైజేషన్‌లో(30 సబ్జెక్టులు) ఉంటుంది. సెట్ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఒకటే రోజున పరీక్షను రెండు వేర్వేరు సెషన్లలో పెడతారు. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. మొత్తం మూడు గంటల వ్యవధిలో సెట్ పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం మూడు గంటల వ్యవధిలో సెట్ పరీక్ష జరుగుతుంది. ఏపీలోని విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, కడప, కర్నూలు పరీక్ష కేంద్రాల్లో సెట్ నిర్వహిస్తారు.