Andhra Pradesh

ఏప్రిల్ పింఛన్ రెండ్రోజులు ఆలస్యం, పంపిణీపై వాలంటీర్లకు కీలక ఆదేశాలు-vijayawada ap pension distribution april two days late govt orders volunteers no campaign ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


ఏప్రిల్ పింఛన్లు కాస్త ఆలస్యం

అలాగే ఈసారి పింఛన్ల పంపిణీ కాస్త ఆలస్యం(April Pensions) కావొచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి నెల 1వ తేదీన వాలంటీర్లు(Volunteers) పింఛన్లు పంపిణీ చేస్తుంటారు. అయితే ఈసారి పంపిణీ ఆలస్యం అవుతుందని తెలిపారు. ఏప్రిల్1వ తేదీన కాకుండా ఏప్రిల్ 3న పింఛన్లు పంపిణీ చేస్తారని అధికారులు స్పష్టం చేశారు. లబ్దిదారులు ఈ అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ నెలకు మాత్రమే ఈ విధంగా ఆలస్యం అవుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీ ఆలస్యం అవుతాయని అధికారులు పేర్కొన్నారు. మార్చి 31తో 2023-24 ఆర్థిక సంవత్సరం(Financial Year) పూర్తికానుంది. మార్చి 31న, ఏప్రిల్ 1న బ్యాంకులు(Banks) కార్యకలాపాలు సాగించవు. ఈ కారణంతో ఏప్రిల్ 1కి నగదు అందదని, రెండో తేదీన నగదు డ్రా చేసి ఏప్రిల్ 3న పంపిణీ చేస్తారని అధికారులు స్పష్టం చేశారు. ఈ సమాచారాన్ని మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని పింఛన్ లబ్దిదారులు సమాచారం అందించాలని తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా పింఛన్ నగదు విత్ డ్రా చేసేందుకు కొన్ని ఇబ్బందుల ఉంటాయని, బ్యాంకు మేనేజర్లతో మాట్లాడి ఇబ్బందులు లేకుండా చూడాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. వీలైనంత త్వరగా లబ్దిదారులకు పింఛన్ పంపిణీ చేసేందుకు సిబ్బంది అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.



Source link

Related posts

Mudragada Comments: వేధించడం కంటే ఒకేసారి చంపేయాలని వేడుకున్న ముద్రగడ పద్మనాభం

Oknews

Ysrcp Corporator Husband: చంద్రబాబు ర్యాలీలో చోరీ చేస్తూ దొరికిన వైసీపీ కార్పొరేటర్ భర్త

Oknews

Tirumala : శ్రీవారి భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు

Oknews

Leave a Comment