సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు
వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ విజయరామరాజు మాట్లాడుతూ… బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా సీతారాముల కల్యాణానికి(Vontimitta Sitaramula kalyanam) విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ, జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా భద్రత, పార్కింగ్, అన్నప్రసాదాల పంపిణీ, తాత్కాలిక మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా, ప్రథమ చికిత్స కేంద్రాలు, ఆర్టీసీ బస్సులు, సైన్ బోర్డులు, పారిశుద్ధ్యం, పబ్లిక్ అడ్రస్ సిస్టం విభాగాలపై సమీక్షించి పలు సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశిల్ మాట్లాడుతూ.. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, జిల్లా పోలీసు యంత్రాంగం కలిసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారన్నారు. అవసరమైన అన్ని ప్రాంతాలలో సీసీ కెమరాలు, కంట్రోల్ రూం ఏర్పాటు తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు.