ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ప్లంబర్, పెయింటర్ జనరల్, మెషినిస్ట్ గ్రైండర్, డ్రాఫ్టస్‌మెన్ సివిల్, మోటార్ మెకానిక్, స్టెనోగ్రఫీ, కార్పెంటర్, ఇన్ట్స్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రోప్లేటర్, కంప్యూటర్ హార్డ్‌వేర్ అండ్ నెట్‌వర్క్ నిర్వహణ తదితర ట్రేడ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ట్రేడుల్లో చేరేందుకు ఎనిమిదో, పదో తరగతి అర్హత కలిగి ఉండాలి. దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు 14 సంవత్సరాలు కంటే తక్కువ, 25 సంవత్సరాలు కంటే ఎక్కువ వయస్సు ఉండకూడదు. అయితే రిజర్వ్ చేసిన కేటగిరీలు, మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తుదారులకు వయస్సు సడలింపు ఉంటుంది.